పాలమూరు ఎమ్మెల్సీలకు గెలుపు పత్రాలు అందజేత

ABN , First Publish Date - 2021-11-26T23:09:42+05:30 IST

ఫూర్వ మహబూబ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా

పాలమూరు ఎమ్మెల్సీలకు గెలుపు పత్రాలు అందజేత

మహబూబ్ నగర్: ఫూర్వ మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవం అయిన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఎన్నికల అబ్జర్వర్ శ్రీధర్ ధ్రువీకరణ పత్రం అందజేశారు. అధికారుల నుంచి ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి  గెలుపు పత్రాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికయిన దామోదర్ రెడ్డి, నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా మరోసారి ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తమకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. Read more