6 నుంచి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్
ABN , First Publish Date - 2021-10-28T09:43:52+05:30 IST
ఇంటర్మీడియట్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ (జవాబు పత్రాల మూల్యాంకనం)ను నవంబరు 6 నుంచి నిర్వహించాలని ...

- మూడో రోజు పరీక్షలకు 93.8 శాతం హాజరు
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ (జవాబు పత్రాల మూల్యాంకనం)ను నవంబరు 6 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం జిల్లాల అధికారులకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 13 కేంద్రాల్లో రెండు దశల్లో ఈ మూల్యాంకనాన్ని నిర్వహించనున్నారు. మొదటి దశను నవంబరు 6 నుంచి, రెండో దశను 8 నుంచి చేపడతారు. రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 3వ తేదీతో ఇవి ముగియనున్నాయి. కాగా, ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా మూడో రోజు బుధవారం మొత్తం 4,58,557 మందికి గాను 4,29,972 మంది (93.8 శాతం) హాజరయ్యారు.