ఇంటర్‌ సెకండియర్‌కు 43శాతం మంది హాజరు

ABN , First Publish Date - 2021-02-05T08:55:18+05:30 IST

కొన్ని నెలల అనంతరం తిరిగి ప్రారంభమైన ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులు 43.40 శాతం మంది హాజరయ్యారని...

ఇంటర్‌ సెకండియర్‌కు 43శాతం మంది హాజరు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): కొన్ని నెలల అనంతరం తిరిగి ప్రారంభమైన ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులు 43.40 శాతం మంది హాజరయ్యారని ఇంటర్‌ బోర్డు తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి కాలేజీలు ప్రారంభమవ్వగా.. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రోజువిడిచిరోజు తరగతులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1న ప్రథమ సంవత్సరంలో 33 శాతం మంది, 3న 45.33 మంది హాజరయ్యారు. అలాగే 2న ఇంటర్‌-2 విద్యార్థులు 30.60 శాతం మంది హాజరయ్యారు.   

Updated Date - 2021-02-05T08:55:18+05:30 IST