ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు

ABN , First Publish Date - 2021-10-26T02:22:42+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు

ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు ఇంటర్ మీడియేట్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ పరీక్షకు 4,29,177మంది విద్యార్థులు హాజరు అయ్యారన్నారు. 6.5శాతం మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని వారు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ అవ్వలేదన్నారు. ఎలాంటి అవాంఛిత సంఘటనలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-10-26T02:22:42+05:30 IST