పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ప్రశ్న పత్రాలు

ABN , First Publish Date - 2021-10-22T05:09:19+05:30 IST

పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ప్రశ్న పత్రాలు

పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ప్రశ్న పత్రాలు

 జనగామ కల్చరల్‌, అక్టోబరు 21: ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ ప్రశ్నపత్రాలు గురువారం పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నాయి. ఈ నెల 25 నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కాగా జిల్లాకు సంబంధించిన ప్రశ్నపత్రాలు హన్మకొండ నుంచి సంబంధిత పోలీ్‌సస్టేషన్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం సెట్‌- ఏ ప్రశ్నపత్రాలు పోలీ్‌సస్టేషన్‌కు చేరుకోగా శుక్రవారం మరో సెట్‌ పోలీ్‌సస్టేషన్లకు చేరుకోనున్నాయి. పోలీస్‌ స్టేషన్‌లో ప్రశ్నాపత్రాల చేరివేతను డీఐఈవో బైరి శ్రీనివాస్‌, డెక్‌ మెంబర్లు సీహెచ్‌.విద్యాసాగర్‌రెడ్డి, ఎస్‌.ధర్మేంద్ర, కస్టోడియన్‌ అధికారులు పర్యవేక్షించారు. 

Updated Date - 2021-10-22T05:09:19+05:30 IST