ఫ్రిజ్‌లో పెట్టక్కర్లేని ఇన్సులిన్‌

ABN , First Publish Date - 2021-10-07T07:05:11+05:30 IST

హైదరాబాద్‌లోని సీఎ్‌సఐఆర్‌-ఐఐసీటీ పరిశోధకులు మరో సరికొత్త ఆవిష్కరణ

ఫ్రిజ్‌లో పెట్టక్కర్లేని ఇన్సులిన్‌

  • గది ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేసే ‘ఇన్సులాక్‌’
  • కొత్త మాలిక్యూల్‌ సమ్మేళనం అభివృద్ధి 
  • చేసిన హైదరాబాద్‌ ఐఐసీటీ శాస్త్రవేత్తలు 
  • ఎలుకలపై పరిశోధనలు పూర్తి
  • త్వరలో మనుషులపై కూడా


 

హైదరాబాద్‌, అక్టోబరు 6: హైదరాబాద్‌లోని సీఎ్‌సఐఆర్‌-ఐఐసీటీ పరిశోధకులు మరో సరికొత్త ఆవిష్కరణ చేశారు. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ప్రభావశీలతను కోల్పోకుండా క్రియాశీలంగా ఉండగల ఇన్సులిన్‌ సమ్మేళనాన్ని తయారు చేశారు. కోల్‌కతాలోని సీఎ్‌సఐఆర్‌-ఐఐసీబీ శాస్త్రవేత్తల సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు. ‘ఇన్సులాక్‌’గా పేరుపెట్టిన ఈ ఇన్సులిన్‌తో ఇప్పటికే ఎలుకలపై ప్రయోగ పరీక్షలు పూర్తవగా, త్వరలో మనుషులపై ట్రయల్స్‌ జరగనున్నాయి.


Updated Date - 2021-10-07T07:05:11+05:30 IST