వైఎస్సార్‌టీపీకి ఇందిరాశోభన్‌ గుడ్‌బై

ABN , First Publish Date - 2021-08-21T06:41:23+05:30 IST

వైఎస్సార్‌టీపీకి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్‌ గుడ్‌బై చెప్పారు. శుక్రవారం తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత్రి షర్మిలకు ఆమె పంపారు.

వైఎస్సార్‌టీపీకి ఇందిరాశోభన్‌ గుడ్‌బై

తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరే అవకాశం

హైదరాబాద్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): వైఎస్సార్‌టీపీకి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్‌ గుడ్‌బై చెప్పారు. శుక్రవారం తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత్రి షర్మిలకు ఆమె పంపారు. అమరవీరుల ఆశయ సాధన, నిరుద్యోగులకు న్యాయం, దళిత, గిరిజన, బహుజన, మైనార్టీ వర్గాల సాధికారత, మహిళలకు సమాన వాటా కోసం ప్రాణం ఉన్నంత వరకూ కొట్లాడుతూనే ఉంటానని ఆమె పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ముందుకు సాగాలంటే వైఎ్‌సఆర్‌టీపీలో ఉండకూడదని తన శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారని, అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు. కాగా, వైఎస్సార్‌టీపీకి రాజీనామా చేసిన ఇందిరా శోభన్‌.. తిరిగి కాంగ్రెస్‌ గూటికే చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2021-08-21T06:41:23+05:30 IST