ఆస్పత్రులు, కంపెనీలు, రెసిడెన్షియల్‌ కాంప్లెక్సుల్లో వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-05-05T07:29:42+05:30 IST

వ్యాక్సినేషన్‌పై ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌కు చెందిన గ్లోబల్‌ (గ్లెనిగల్స్‌) హాస్పిటల్స్‌, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ చేతులు కలిపాయి.

ఆస్పత్రులు, కంపెనీలు, రెసిడెన్షియల్‌ కాంప్లెక్సుల్లో వ్యాక్సినేషన్‌

గ్లోబల్‌ హాస్పిటల్స్‌తో భారత్‌ బయోటెక్‌ ఒప్పందం 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వ్యాక్సినేషన్‌పై ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌కు చెందిన గ్లోబల్‌ (గ్లెనిగల్స్‌) హాస్పిటల్స్‌, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ చేతులు కలిపాయి. ఒప్పందంలో భాగంగా 18-44 ఏళ్లలోపు వారికి హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులోని గ్లోబల్‌ ఆస్పత్రుల్లో కొవాగ్జిన్‌ ఇవ్వనున్నారు. ఒక నెల రోజుల్లో నెట్‌వర్క్‌లోని మిగిలిన ఆస్పత్రులు కూడా యువతకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపడతాయని ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ ఇండియా సీఈఓ శ్రీరామ్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. మూడో దశ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఆస్పత్రులతో పాటు కంపెనీలు, రెసిడెన్షియల్‌ కాంప్లెక్సుల్లోనూ వ్యాక్సినేషన్‌ శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్లోబల్‌ ఆస్పత్రులు చేపట్టే వ్యాక్సినేషన్‌కు భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ను అందించనుంది. 

Updated Date - 2021-05-05T07:29:42+05:30 IST