యూనిట్‌కు రూపాయి?
ABN , First Publish Date - 2021-12-15T07:47:52+05:30 IST
రాష్ట్రం లో కరెంటు చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. డిస్కమ్‌లు ఇప్పటికే ప్రభుత్వం ముందు మూడు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలిసింది.

- పెరగనున్న కరెంటు చార్జీలు.. ప్రభుత్వానికి 3 ప్రతిపాదనలు
- యూనిట్‌కు 50 పైసలు, రూ.1, రూ.2 పెంపు ప్రతిపాదనలు సమర్పించిన డిస్కమ్‌లు
- రూపాయి పెంపునకే సర్కారు ఓకే?.. ఐదేళ్లుగా పెంచలేదు
- కేంద్ర నిర్ణయాలతో డిస్కమ్‌లపై భారం: హరీశ్, జగదీశ్‌రెడ్డి
- వరుసగా మంత్రుల సమాలోచనలు
- విద్యుత్తుసౌధలో అధికారులతో సమీక్ష
- చార్జీల పెంపు అనివార్యమని సంకేతం!
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో కరెంటు చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. డిస్కమ్‌లు ఇప్పటికే ప్రభుత్వం ముందు మూడు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలిసింది. యూనిట్‌కు 50 పైస లు, రూ.1, రూ.2 పెంచడం వల్ల ఏ మేరకు లోటు భర్తీ అవుతుందో నివేదించినట్లు సమాచారం. గణాంకాలతో సహాప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోం ది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిలు వరుసగా సుదీర్ఘ భేటీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం విద్యుత్తుసౌధలో అధికారుల తో సమీక్షించారు. డిస్కమ్‌లు ఆర్థికంగా నష్టపోవడానికి కారణాలపై చర్చించారు. ఈ సందర్భంగా చార్జీల పెం పు తప్పదనే సంకేతాలిచ్చారు. బుధవారం కూడా అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం చార్జీల పెంపు ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత టారిఫ్ ప్రతిపాదనలుఈఆర్‌సీలో సమర్పించడానికి డిస్కమ్‌లకు ప్రభు త్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మధ్యేమార్గంగా యూనిట్‌కు రూ.1 పెంచడానికే ప్రభుత్వం అనుమతిచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్) ను డిస్కమ్‌లు ఇదివరకే రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎ్‌సఈఆర్‌సీ)లో దాఖలు చేశాయి. రెండేళ్లకు గాను లోటు రూ.21,550 కోట్లుగా ఉందని ఇప్పటికే డిస్కమ్‌లు ప్రకటించాయి. ప్రస్తుతానికి 2022-23 ఆర్థిక సంవత్సరం పిటిషన్‌నే విచారించాలని ఈఆర్‌సీ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు టారిఫ్ ప్ర తిపాదనలు సమర్పించాలని డిస్కమ్‌లకు నోటీసులు కూడా ఇచ్చింది. ఈ గడువు కూడా ఈ నెల 10న ముగియడంతో 20న డిస్కమ్‌ల ఏఆర్‌ఆర్ పిటిషన్ల విచారణార్హతపై హియరింగ్ నిర్వహించాలని ఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ లోగానే టారిఫ్ ప్రతిపాదనల ను ఈఆర్‌సీకి సమర్పించాలని డి స్కమ్‌లు యోచిస్తున్నాయి. యూనిట్‌కు కనీసం రూ.1 పెంచితే తప్ప డిస్కమ్‌లు గట్టెక్కలేవని అధికారు లు చెబుతున్నారు. యూనిట్‌కు రూ.1 పైనే ప్రతిపాదిస్తే.. ఈఆర్‌సీ మాత్రం రూ.1కే ఆమోదముద్ర వేస్తుందని ఆశాభావంతో ఉన్నారు.
అన్ని రాష్ట్రాల టారిఫ్‌లపై అధ్యయనం
కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించడానికి ముందు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చార్జీలు ఎలా ఉన్నాయనేదానిపై డిస్కమ్‌లు అధ్యయనం చేశాయి. కర్ణాటకలో గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉంటూ 40 యూనిట్లలోపు వినియోగించేవారికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో దేశంలోనే అత్యల్పంగా 50 యూనిట్లలోపు వాడే వారికి యూనిట్‌కు 80 పైసలే వసూలు చేస్తున్నారు. మహారాష్ట్రలో కూడా 30 యూనిట్లలోపు వి ద్యుత్తును వాడే గ్రామీణ పేదలకు యూనిట్‌కు రూ. 1.14 వసూలు చేస్తున్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు పలు రా ష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ పేద వర్గాలకు వేర్వేరుగా టారిఫ్ అమల్లో ఉంది. తెలంగాణలో టారిఫ్ మాత్రం వినియోగం ఆధారంగానే ఉంది.

రాష్ట్రం ఏర్పడే నాటికే రూ.12వేల కోట్ల నష్టాలు!
రాష్ట్రంలో ఐదేళ్లుగా కరెంటు చార్జీలు పెంచలేదని మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి చెప్పారు. కొవిడ్ కారణంగా డిస్కమ్‌లకు రావాల్సిన రూ.4374 కోట్ల బిల్లులు ఆగిపోయాయని తెలిపారు. మంగళవారమిక్కడి విద్యుత్తుసౌధలో కరెంటు చార్జీల సవరణ అంశంపై మంత్రు లు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏయే కారణాల వల్ల డిస్కమ్‌లు దెబ్బతింటున్నాయో సమీక్షించా రు. రాష్ట్రంలో ప్రతి వ్యవసాయ కనెక్షన్‌కు రూ.18,167 సబ్సిడీని ప్రభుత్వం చెల్లిస్తోందని మంత్రులు వెల్లడించా రు. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల దాకా రా యితీతో కరెంటు సరఫరా చేస్తున్నామని, ఇందుకోసం రూ.1253 కోట్లు భరిస్తున్నట్లు తెలిపారు. ఎత్తిపోతల పథకాల కరెంట్ బిల్లులకు రూ.3200 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల దాకా; ధోబీ ఘా ట్లు, సెలూన్లకు 250 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రం ఏ ర్పడే నాటికి డిస్కమ్‌లకు రూ.12,185 కోట్ల నష్టాలు ఉన్నాయన్నారు. సంస్కరణల పేరుతో మోదీ ప్రభుత్వం డిస్కమ్‌లకు షాక్ ఇస్తోందని చెప్పారు. టన్నుకు రూ.50 ఉండే స్వచ్ఛ ఇంధన సెస్‌ను రూ.400కు పెంచడంతో ఏడేళ్లలో రూ.7,200 కోట్ల అదనపు భారం పడిందని గుర్తుచేశారు. డిస్కమ్‌లు థర్మల్ విద్యుత్కేంద్రాల నుంచి ఏటా 50 వేల మిలియన్ యూనిట్లను కొంటున్నాయన్నా రు.

బొగ్గు ధరలను 6-10 శాతం పెంచుతుండడంతో అ దనంగా ఏటా రూ.725 కోట్ల భారం డిస్కమ్‌లపై పడిందన్నారు. గడిచిన నాలుగేళ్లలో బొగ్గు రవాణాకు రైల్వే చా ర్జీలను 40 శాతం మేర పెంచడంతో వాటిని ఏ రకంగా పూడ్చుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో సీలేరు, కృష్ణపట్నం విద్యుదుత్పత్తి కేంద్రాల పీపీఏలను తెలంగాణతో ఏకపక్షంగా రద్దు చేశారని, దీనివల్ల బహిరంగ మార్కెట్‌లో కరెంట్ కొనుగోళ్లతో అదనంగా రూ.2763 కోట్ల ఆర్థిక భా రం పడిందని తెలిపారు. ఏపీ జెన్‌కో నుంచి విద్యుత్తును నిలిపివేయడంతో రూ.2502 కోట్లు అదనంగా భరించాల్సి వచ్చిందన్నారు. 19.03 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉం డగా గడిచిన ఏడేళ్లలో 6.89 లక్షల కనెక్షన్లు అదనంగా మంజూరు చేయడంతో వీటిపైనే రూ.3,375 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. విద్యుత్తు సంస్థలను కాపాడుకోవాలం టే చార్జీల పెంపు తప్పదని మంత్రులు సంకేతాలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
