పాడు వ్యామోహం.. 3 జీవితాలు ఖతం!

ABN , First Publish Date - 2021-09-03T08:59:34+05:30 IST

ఆ ఊర్లో రెండు జంటలు. మొదటి జంటలోని భర్తకు, రెండో జంటలలోని భార్యతో వివాహేర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఎవ్వరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయారు.

పాడు వ్యామోహం.. 3 జీవితాలు ఖతం!

  • ఒకరి భార్యతో మరొకరి భర్త వివాహేతర సంబంధం..
  • తమ ఇళ్లలో చెప్పకుండా ఇద్దరూ ఊరి నుంచి పరార్‌ 
  • ఇది తెలిసి అవమానభారంతో ఉరివేసుకున్న భర్త.. 
  • వెళ్లిపోయిన ఆ జంట అనుమానాస్పదస్థితిలో మృతి 
  • రెండు ఇళ్లలో విషాదం.. ఖమ్మం జిల్లాలో ఘటన 

పెనుబల్లి, సెప్టెంబరు 2: ఆ ఊర్లో రెండు జంటలు. మొదటి జంటలోని భర్తకు, రెండో జంటలలోని భార్యతో వివాహేర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఎవ్వరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయారు. ఇది తెలిసి రెండో జంటలోని భర్త తీవ్ర మనోవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది జరిగిన వారానికి పారిపోయిన ఆ జంట అనుమానాస్పద స్థితిలో విగతజీవులుగా కనిపించారు. ఇలా ఓ వివాహేత సంబంధం ముగ్గురి మృతికి దారితీసి.. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసి.. మరో ఇద్దరు పిల్లలకు తండ్రిని దూరం చేసి..  రెండు ఇళ్లలోనూ పెను విషాదాన్ని నింపింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో ఈ ఘటనలు ఆలస్యంగా వెలుగుచూశాయి. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంజిమళ్ల సురేశ్‌ (బాలయ్య), కృష్ణవేణిలకు  12 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 11 ఏళ్ల బాబు, 8 ఏళ్ల పాప ఉన్నారు.


ఇదే గ్రామనికి చెందిన పచ్చినీళ్ల ధర్మయ్య, విశ్రాంతి దంపతులకు పదేళ్లలోపు వయసున్న ఇద్ద్దరు కుమారులున్నారు. సురేశ్‌ భార్య కృష్ణవేణికి పచ్చినీళ్ళ ధర్మయ్యకు స్నేహం ఏర్పడి అది వివాహేతర సంబంఽధానికి దారితీసినట్లు తెలిసింది. ఆగస్టు 26న ధర్మయ్య, కృష్ణవేణి.. తమ కుటుంబాలను, గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారని సమాచారం. ఇది తెలిసి తీవ్ర మనస్తాపానికిగురైన కృష్ణవేణి భర్త సురేశ్‌ (32) అదేరోజు రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 29న మృతిచెందాడు. అయితే ఇళ్ల నుంచి వెళ్లిపోయిన ధర్మయ్య, కృష్ణవేణి అదే గ్రామానికి చెందిన మేకతోటి వజ్రమ్మ అనే వృద్ధురాలి పాడుబడ్డ ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. వజ్రమ్మ మరోఊర్లోని కూతురు ఇంటివద్ద ఉంటూ పింఛను డబ్బు కోసం గ్రామానికొచ్చింది.. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో గ్రామస్థుల సహకారంతో తలుపులు తీసి చూడగా ధర్మయ్య, కృష్ణవేణి మృతదేహాలు కనిపించాయి. అయితే ధర్మయ్య భార్య విశ్రాంతి అంతకుముందే భర్తతో గొడవ పడి ఏపీలోని కృష్ణాజిల్లా విస్సన్నపేటలోని పుట్టింటికి వెళ్లింది. అక్కడి పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేయగా ఆ కేసు నడుస్తోంది.  

Updated Date - 2021-09-03T08:59:34+05:30 IST