కల్వరి టెంపుల్ హాస్పిటల్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-12-19T23:27:08+05:30 IST
మియపూర్ లో కల్వరి టెంపుల్ హాస్పటల్ ని ఎమ్మెల్సీ కవిత ఆదివారం ప్రారంభించారు.కల్వరి టెంపుల్ వారు అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.
హైదరాబాద్: మియపూర్‌లో కల్వరి టెంపుల్ హాస్పిటల్ని ఎమ్మెల్సీ కవిత ఆదివారం ప్రారంభించారు.కల్వరి టెంపుల్ నిర్వాహకులు పలు సేవ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. కోవిడ్ సమయంలో 200 బెడ్స్ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారని చెప్పారు.ప్రభుత్వ సహాయంతో ఇప్పుడు 200 బెడ్స్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారన్నారు. పేద వారికి సేవ చేసే వారికి ప్రభుత్వ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఆకలికి, అభివృద్ధికి కులం, మతం ఉండదని చెప్పారు. కల్వరి ఆస్పత్రుల్లో పని చేసే వైద్యలు, నర్స్‌లకు అభినందనలు.. ప్రేమతో సేవ చేయాలని కోరుతున్నానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.