నగరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటులో..ద్వితీయ స్థానంలో హైదరాబాద్‌

ABN , First Publish Date - 2021-01-05T09:08:17+05:30 IST

ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 ప్రముఖ నగరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి సర్ఫ్‌షార్క్‌ సంస్థ నిర్వహించిన

నగరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటులో..ద్వితీయ స్థానంలో హైదరాబాద్‌

ప్రతి చదరపు కి.మీ.కు 480 నిఘానేత్రాలు

ప్రపంచంలో అగ్రస్థానంలో చెన్నై

దేశాల్లో చైనా నం.1.. 2వ స్థానంలో భారత్‌


హైదరాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది.  ప్రపంచ వ్యాప్తంగా 130 ప్రముఖ నగరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి సర్ఫ్‌షార్క్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో చెన్నై మొదటి స్థానంలో, ఢిల్లీ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. చెన్నైలో ప్రతి చదరపు కిలోమీటరుకు 657 సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రతి వెయ్యి మందికి 25.5 కెమెరాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. హైదరాబాద్‌లో ప్రతి చదరపు కిలోమీటరుకు 480 సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే, ప్రతి వెయ్యి మందికి 30 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక ప్రపంచ దేశాల్లో సీసీ కెమెరాలను అత్యధికంగా ఏర్పాటు చేసిన దేశాల్లో చైనా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత భారత్‌ ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి సీసీ కెమెరాను జర్మనీలో 1942లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేరస్థులను పట్టించడంలో ప్రపంచ వ్యాప్తంగా అవే కీలకంగా మారాయి. సీసీ కెమెరాల్లో కొన్నింటిలో ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టంతో అనుసంధానం చేయబడి ఉన్నాయి.  

Updated Date - 2021-01-05T09:08:17+05:30 IST