జగన్మోహినీ అలంకారంలో..

ABN , First Publish Date - 2021-03-22T06:54:13+05:30 IST

యాదాద్రి లక్ష్మీనారసింహుడు జగన్మోహినీ అలంకారంలో భక్తులకు ఆదివారం దర్శనమిచ్చారు.

జగన్మోహినీ అలంకారంలో..

మార్చి 21 (ఆంధ్రజ్యోతి):  యాదాద్రి లక్ష్మీనారసింహుడు జగన్మోహినీ అలంకారంలో భక్తులకు ఆదివారం దర్శనమిచ్చారు. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో విశేష ఘట్టమైన స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం రోజున జగన్మోహినీ అలంకారంలో పెళ్లి కొడుకుగా ముస్తాబుచేసి బాలాలయంలో ఊరేగించారు. ఈ బ్రహ్మోత్సవ కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ దంపతులు సమర్పించనున్నారు.  

ఆంధ్రజ్యోతి, యాదాద్రి

Updated Date - 2021-03-22T06:54:13+05:30 IST