బుస్సాపూర్‌లో..రోడ్డు పక్కన నోట్ల కలకలం

ABN , First Publish Date - 2021-12-30T07:39:59+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా మెండోర మండలంలోని బుస్సాపూర్‌ జాతీయ

బుస్సాపూర్‌లో..రోడ్డు పక్కన నోట్ల కలకలం

మెండోర, డిసెంబరు 29: నిజామాబాద్‌ జిల్లా మెండోర మండలంలోని బుస్సాపూర్‌ జాతీయ రహదారి పక్కన బుధవారం ఓ నోట్ల సంచి కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో వచ్చి గోనె సంచి మూటను విసరేశారు. బుధవారం అటుగా వెళ్లిన స్థానికులు దానిని తెరిచారు. అందులో భారీ సంఖ్యలో చిరిగిన నోట్లు ఉండడంతో.. కంగారుపడ్డారు. పోలీ్‌సలకు సమాచారాన్ని చేరవేశారు. అవి దాదాపు రూ.కోటిపైనే ఉంటాయని స్థానికులు అంటున్నారు.

Updated Date - 2021-12-30T07:39:59+05:30 IST