ఐఎంఏ అధ్యక్షుడిగా బాలాజీ

ABN , First Publish Date - 2021-10-29T05:39:11+05:30 IST

ఐఎంఏ అధ్యక్షుడిగా బాలాజీ

ఐఎంఏ అధ్యక్షుడిగా బాలాజీ
బైరం బాలాజీ అధ్యక్షుడు

హనుమకొండ అర్బన్‌, అక్టోబరు 28: ఐఎంఏ జిల్లా శాఖకు హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా డాక్టర్‌ బైరం బాలాజీ ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి డాక్టర్‌ వద్దిరాజు రాకేష్‌పై 58ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రధా న కార్యదర్శిగా డాక్టర్‌ నాగార్జునరెడ్డి గెలుపొందారు. తన ప్రత్యర్థి డాక్టర్‌ మల్లికార్జున్‌పై 268 ఓట్ల తేడాతో విజ యం సాధించారు. అలాగే కోశాధికారిగా డాక్టర్‌ సనత్‌, సంయుక్త కార్యదర్శి (అర్బన్‌)గా డాక్టర్‌ కంచర్ల ప్రవీణ్‌రెడ్డి ఎన్నికయ్యారు. వీరంతా ఒకే ప్యానల్‌కు సంబంధించిన వారు కావడం విశేషం. కాగా, వైస్‌ ప్రెసిడెంట్‌ (మహిళ)గా డాక్టర్‌ జ్యోతి, వైస్‌ ప్రెసిడెంట్‌ (అర్బన్‌) గా డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, వైస్‌ ప్రెసిడెంట్‌ (రూరల్‌) గా డాక్టర్‌ రాజేశ్వరప్రసాద్‌, జాయింట్‌ సెక్రటరీ (రూర ల్‌)గా డాక్టర్‌ చందునాయక్‌, జాయింట్‌ సెక్రటరీ (మ హిళ)గా డాక్టర్‌ ప్రత్యూష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

వరంగల్‌లోని ఐఎంఏ హాలులో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో 948మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారిగా డాక్టర్‌ బందెల మోహన్‌రావు వ్యవహరించారు. ప్రతి ఓటరు వద్దకు బరిలో నిలిచిన అభ్యర్థులు వెళ్లి ఓటు అడిగిన తీరు ఆకట్టుకుంది. కొన్నేళ్లుగా ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలు.. ఈసారి సాధారణ ఎన్నికలను తలపించే విధంగా జరిగాయి. ఫలితాలు వెలువడిన వెంటనే పెద్ద ఎత్తున బాణాసంచాలతో విజేతలకు స్వాగతం పలికారు. స్వీట్లు, రంగులతో ఆనందకేళిని చేశారు. ఇదిలా వుండగా, 20 రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుల స్థానాల కోసం పోటీపడ్డ 33 అభ్యర్థుల భవిష్యత్తు శుక్రవారం ఉదయం 10 గంటలకు తేలనుంది. అలాగే సెం ట్రల్‌ కౌన్సిల్‌ మెంబర్లుగా 16 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.



Updated Date - 2021-10-29T05:39:11+05:30 IST