ఈనెల 23 నుంచి రెండు రోజుల పాటు ఐజేయూ జాతీయ సమావేశాలు

ABN , First Publish Date - 2021-10-21T23:12:31+05:30 IST

ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ (ఐజేయూ) నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశాలు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు

ఈనెల 23 నుంచి రెండు రోజుల పాటు ఐజేయూ జాతీయ సమావేశాలు

హైదరాబాద్‌: ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ (ఐజేయూ) నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశాలు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు నగరంలోని బేగం పేటలో ఉన్న టూరిజం ప్లాజాలో జరుగుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఈ సమావేశాలు జరుగునున్నాయని తెలిపారు. సమావేశాల్లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలల్లో పనిచేస్తున్న వర్కింగ్‌ జర్నలిస్టులు హాజరు కానున్నారు.


రెండు రోజల పాటు జరిగే ఈ సమావేశాల్లో దేశంలో జర్నలిస్టులు వృత్తిలో ఎదుర్కొంటున్నసమస్యలు, ఫ్రీడమ్‌ ఆఫ్‌ ప్రెస్‌, జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులు, జర్నలిస్టుల రక్షణకు మీడియా సంస్థలు తీసుకోవాల్సిన రక్షణచర్యలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ సమావేశాలకు టూరిజం, ఎక్జైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ప్రణాళికా సంఘం ఉపాఽధ్యక్షుడు వినోద్‌కుమార్‌ హాజరు కానున్నారు. ఈ సమావేశాలకు తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (టీయూడబ్ల్యూజె) హోస్ట్‌ చేస్తోంది. 

Updated Date - 2021-10-21T23:12:31+05:30 IST