బ్లాక్‌ ఫంగస్‌పై ఐఐటీ హైదరాబాద్‌ అస్త్రం

ABN , First Publish Date - 2021-05-30T07:41:18+05:30 IST

బ్లాక్‌ ఫంగ్‌సపై పోరుకు ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు ఓ అస్త్రాన్ని అభివృ ద్ధి చేశారు. ప్రస్తుతం ఈ చికిత్సకు వినియోగిస్తున్న యాంఫోటెరిసిన్‌-బి(ఏఎంబీ) ఇంజెక్షన్‌(50 మిల్లీగ్రాములు) ధర రూ.4000 దాకా ఉంది.

బ్లాక్‌ ఫంగస్‌పై ఐఐటీ హైదరాబాద్‌ అస్త్రం

  • యాంఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్లను 
  • మాత్రల రూపంలో తయారీకి ఫార్ములా 
  • ఏఎంబీ ఇంజెక్షన్‌ 4వేలు..మాత్ర ధర 200లోపే 
  • తయారీ పరిజ్ఞానం బదిలీకి సిద్ధమని ప్రకటన

హైదరాబాద్‌, మే 29 : బ్లాక్‌ ఫంగ్‌సపై పోరుకు ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు ఓ అస్త్రాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ చికిత్సకు వినియోగిస్తున్న యాంఫోటెరిసిన్‌-బి(ఏఎంబీ) ఇంజెక్షన్‌(50 మిల్లీగ్రాములు) ధర రూ.4000 దాకా ఉంది. ఒక్కో రోగికి పదుల సంఖ్యలో ఇంజెక్షన్‌ డోసులను ఇవ్వాల్సి వస్తోంది. ఈ లెక్కన చికిత్సంతా పూర్తయ్యేసరికి ఇంజెక్షన్లకే లక్షలాది రూపాయలను ఖర్చు చేయాల్సి ఉం టుంది. ఈనేపథ్యంలో కారుచీకట్లో కాంతి కిరణంలా ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు మెరిశారు. యాం ఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్‌ను మాత్రల రూపంలో త యారు చేసే పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. 60 మిల్లీగ్రాముల మోతాదులో ఉండే ఒక్కో ఏఎంబీ మాత్ర ధర రూ.200కు మించకపోవచ్చని ఐఐటీ హైదరాబాద్‌ శనివారం వెల్లడించింది. ఏఎంబీ ట్యాబ్లెట్లు బ్లాక్‌ ఫంగస్‌ రోగులపై చాలా నెమ్మదిగా ప్రభావాన్ని చూపుతాయని.. ఫలితంగా వివిధ ఔషధాలు, రసాయనాల వల్ల బాధితుల కిడ్నీలపై పడిన ‘నెఫ్రో టాక్సిసిటీ’ దుష్ప్రభావం క్రమక్రమంగా తగ్గిపోతుందని వివరించింది. అయితే ఈ ఆవిష్కరణకు పేటెంట్లు రావాల్సి ఉందని ఐఐటీహెచ్‌ తెలిపింది. 

Updated Date - 2021-05-30T07:41:18+05:30 IST