ఇలా అయితే ఓటు చెల్లదు

ABN , First Publish Date - 2021-03-14T07:01:57+05:30 IST

: పోలింగ్‌ రోజున కరోనా నిబంధనలు పాటించాలని ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ఆదేశించింది. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లే ప్రతి వారు విధిగా మాస్కును ధరించాలి.

ఇలా అయితే ఓటు చెల్లదు

ప్రాధాన్య క్రమంలో ఒకటిని వదిలేస్తే..

ఒకే ప్రాధాన్యాన్ని ఒకరి కంటే ఎక్కువ మందికి ఇస్తే.. 

ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ప్రాధాన్యాలు ఇవ్వడం

బ్యాలెట్‌ పత్రంలో ప్రాధాన్యాలను రోమన్‌ అంకెల్లో సూచించవద్దు. 

బ్యాలెట్‌ పత్రంపై ఓటర్‌ ఇంటి పేరు, ఇతర పదాలు రాయొద్దు. 

అభ్యర్థుల ఎంపిక వరుసను ఒకటి, రెండు, మూడు.. 

అని పదాల్లో రాయకూడదు. 1, 2, 3 అని అంకెల్లో మాత్రమే సూచించాలి. 

అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న గడుల్లో (రైట్‌ మార్క్‌, ఇంటూ మార్క్‌) వేయవద్దు. 

అభ్యర్థి ఫొటో పక్కన ఉన్న గడిలోనే అంకె రాయాలి. ఇద్దరు అభ్యర్థుల మధ్యలో ఉన్న గడిలో రాస్తే ఓటు చెల్లదు.

కరోనా నిబంధనలు పాటించాల్సిందే: పోలింగ్‌ రోజున కరోనా నిబంధనలు పాటించాలని ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ఆదేశించింది. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లే ప్రతి వారు విధిగా మాస్కును ధరించాలి. ఓటర్లు క్యూ లైన్‌లో భౌతిక దూరం పాటించాలి. పురుషులకు, మహిళలకు వేరు వేరుగా క్యూ లైన్‌లు ఉంటాయి. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్‌ ఉంటుంది. పోలింగ్‌ కేంద్రం వద్ద ఎక్కువ మంది ఓటర్లు ఉంటే వేచి ఉండేందుకు వీలుగా టెంటు, కుర్చీలు ఉంటాయి.

Updated Date - 2021-03-14T07:01:57+05:30 IST