జిల్లాలో ఐదుగురు మహిళా ఐఏఎ్‌సల పర్యటన
ABN , First Publish Date - 2021-09-03T06:26:57+05:30 IST
జిల్లాలో ఐదుగురు మహిళా ఐఏఎ్‌సల పర్యటన

ములుగు, సెప్టెంబరు 2: ములుగు జిల్లాలో శుక్రవారం ఐదుగురు మహిళా ఐఏఎ్‌సలు పర్యటించనున్నారు. సీఎంవో సెక్రటరీలు స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్, హెల్త్ కమిషనర్ వాకాటి కరుణ, ట్రైబెల్ వెల్ఫేర్ సెక్రటరీ క్రిస్టినా, మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్ జిల్లాకు వస్తున్నారు. ముందుగా మంగపేట మండలం బ్రాహ్మణపల్లిలోని పీహెచ్‌సీని తనిఖీ చేస్తారు. అనంతరం ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి సబ్‌సెంటర్, తాడ్వాయి మండ ల కేంద్రంలోని అంగన్‌వాడీ సెంటర్, వెంకటాపూర్(రామ ప్ప) మండలంలోని పాలంపేట సబ్‌సెంటర్, ములుగు మం డలం జంగాలపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చే యనున్నారు. అక్కడ అందుతున్న సేవలపై లబ్ధిదారులతో సమీక్షిస్తారు. ఆతర్వాత ములుగు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏల పీవోలు, ఆయా జిల్లాల అధికారులతో సమావేశమవుతారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు అందుతున్న వైద్యం, పౌష్టికాహారం పంపిణీ తదితర అంశాలను సమీక్షిస్తారు. ఒకేసారి ఐదుగురు మహిళా ఐఏఎస్ అధికారుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకోగా ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.