నాపై పోలీసులు దాడి చేశారు

ABN , First Publish Date - 2021-10-19T08:52:26+05:30 IST

ఉద్యోగాల నోటిఫికేషన్లపై మంత్రి హరీశ్‌రావును ప్రశ్నించిన తనపై పోలీసులు దాడి చేశారని నిరోష అనే యువతి ఆరోపించింది. సెల్ఫీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా అది వైరల్‌గా మారింది.

నాపై పోలీసులు దాడి చేశారు

మంత్రి హరీశ్‌ను ప్రశ్నించిన యువతి సెల్ఫీ వీడియో

వీణవంక, అక్టోబరు 18: ఉద్యోగాల నోటిఫికేషన్లపై మంత్రి హరీశ్‌రావును ప్రశ్నించిన తనపై పోలీసులు దాడి చేశారని నిరోష అనే యువతి ఆరోపించింది. సెల్ఫీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా అది వైరల్‌గా మారింది. కరీంనగర్‌ జిల్లా వీణవంకలో ఆదివారం రాత్రి టీఆర్‌ఎస్‌ నిర్వహించిన ధూంధాంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతుండగా.. నిరోష అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని పలుమార్లు ప్రశ్నించింది. దీంతో పోలీసులు ఆ యువతిని పక్కకు తీసుకెళ్లారు. సభ ముగిసిన అనంతరం ఆమెను పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అయితే.. అక్కడ మహిళా కానిస్టేబుళ్లు తనను తిడుతూ చిత్రహింసలు పెట్టారని నిరోష సెల్ఫీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా.. అది వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆమెతో ఫోన్లో మాట్లాడారు.

Updated Date - 2021-10-19T08:52:26+05:30 IST