అట్రాసిటీ కేసులో బెయిలు కోసం మల్లన్న రిట్‌

ABN , First Publish Date - 2021-10-19T09:07:06+05:30 IST

తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ తీన్మార్‌ మల్లన్న హైకోర్టును ఆశ్రయించారు.

అట్రాసిటీ కేసులో బెయిలు కోసం మల్లన్న రిట్‌

ఫిర్యాదీని ఇంప్లీడు చేయాలన్న హైకోర్టు

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ తీన్మార్‌ మల్లన్న హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌లో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుడిని ఇంప్లీడ్‌ చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. అశోక్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు మల్లన్నపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-10-19T09:07:06+05:30 IST