వరంగల్, హన్మకొండ జిల్లాల్లో రేపు సీఎం కేసీఆర్ పర్యటన

ABN , First Publish Date - 2021-11-09T21:43:42+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు.

వరంగల్, హన్మకొండ జిల్లాల్లో రేపు సీఎం కేసీఆర్ పర్యటన

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పలు అభివృద్ధిపనులపై సమీక్ష నిర్వహించనున్నారు. వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్ రోడ్, ఇతర మున్సిపాలిటీలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, వరంగల్, హన్మకొండ జంట నగరాల రవాణ అభివృద్ధికి అవరోధంగా ఉన్న రైల్వే ట్రాక్‌పై రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం తదితర అభివృద్ధి అంశాలపై స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్షించనున్నారు. వరంగల్ ఇంటర్నల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, టెక్స్‌టైల్ పార్క్ పనుల పురోగతి అంశాలను సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. అలాగే హన్మకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

Updated Date - 2021-11-09T21:43:42+05:30 IST