హైదరాబాద్: BJP కార్పొరేటర్ల ఆందోళన
ABN , First Publish Date - 2021-10-25T17:56:49+05:30 IST
బీజేపీ కార్పొరేటర్లు బుద్ధ భవన్‌లోని జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు.

హైదరాబాద్: నగరంలోని బీజేపీ కార్పొరేటర్లు బుద్ధ భవన్‌లోని జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు ఉన్నా... ఎలాంటి ఫైన్లు వేయడం లేదని, వాటిని తొలగించడం లేదని ఆరోపించారు. ప్రతి పక్షాలకు ఒక న్యాయం, అధికార పార్టీకి మరో న్యాయమా? అంటూ బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.