Hyderabad: దూసుకొచ్చిన డీసీఎం..వాచ్‌మన్ మృతి
ABN , First Publish Date - 2021-10-20T12:50:15+05:30 IST
డీసీఎం అదుపు తప్పి ఢీ కొట్టడంతో వాచ్‌మన్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డినగర్‌లోని పద్మబాలాజీ మెటల్ ఇండస్ట్రీ వద్ద నారప్ప (62) వాచ్‌మన్‌గా పని

హైదరాబాద్/బాలానగర్: డీసీఎం అదుపు తప్పి ఢీ కొట్టడంతో వాచ్‌మన్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డినగర్‌లోని పద్మబాలాజీ మెటల్ ఇండస్ట్రీ వద్ద నారప్ప (62) వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం కంపెనీకి సమీపంలో డీసీఎంను పార్క్ చేసి డ్రైవర్, క్లీనర్ భోజనానికి వెళ్లారు. కంపెనీ నిర్వాహకులు డీసీఎంను అక్కడి నుంచి తీయించేందుకు చూడగా డ్రైవర్ లేడు. కంపెనీలో పని చేస్తున్న హెల్పర్ వికా్‌సకుమార్‌ను డీసీఎం తీయమని చెప్పారు. డ్రైవింగ్ పూర్తిగా తెలియని వికాస్ డీసీఎం నడిపేందుకు ప్రయత్నించగా వాహనం అదుపు తప్పి కంపెనీ గేటు ముందు కూర్చున్న నారప్పపైకి దూసుకెళ్లింది. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలానగర్ పోలీసులు వికా్‌సను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. నారప్ప కర్ణాటక నుంచి బతుకుదెరువు కోసం వచ్చాడు. ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, భార్య ఉన్నారు. పెద్ద దిక్కు కోల్పోవడంతో వారంతా రోడ్డున పడ్డారు. నారప్ప కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేసున్నాయి.