నిందితుడి మృతిపై చిన్నారి తండ్రి స్పందన..
ABN , First Publish Date - 2021-09-16T18:35:14+05:30 IST
హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘట్‌కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు దగ్గర రాజారాం వంతెన రేల్వే ట్రాక్‌పై రాజు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన బాధితురాలి తండ్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ నిందితుడు చనిపోయాడని పోలీసులు చెబితే తాము నమ్మమని, మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకురావాలని అన్నారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడింది అతనేనా? అనేది తాము గుర్తుపడతామని అన్నారు. బతికి ఉంటే చంపుతామనే భయంతో తీసుకురాకపోవచ్చు.. ఇప్పుడు ఎలాగూ చనిపోయాడు కాబట్టి ఆ బాడీని మా మందుకు తీసుకువాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితుడు అతనా కాదా అనేది చూస్తామన్నారు. ఆ వార్తపై తమకు అనుమానం ఉందని, పోలీసులపై నమ్మకం లేదని, మృత దేహాన్ని చూస్తేనే నమ్మకం కుదురుతుందని ఆయన స్పష్టం చేశారు.