రిజ‌ర్వాయ‌ర్ల దగ్గర సీసీ కెమెరాల ఏర్పాటు: దానకిషోర్

ABN , First Publish Date - 2021-12-10T02:15:02+05:30 IST

నగరంలోని రిజ‌ర్వాయ‌ర్ల దగ్గర భ‌ద్రత‌ కోసం సీసీ కెమెరాలను

రిజ‌ర్వాయ‌ర్ల దగ్గర సీసీ కెమెరాల ఏర్పాటు: దానకిషోర్

హైదరాబాద్: నగరంలోని రిజ‌ర్వాయ‌ర్ల దగ్గర భ‌ద్రత‌ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్ తెలిపారు. నగరంలోని ముషీరాబాద్ రిసాల‌గ‌డ్డ వాట‌ర్‌ట్యాంక్‌లో మృతదేహం లభ్యం కావడం దురదృష్టక‌ర‌మని దానకిషోర్ అన్నారు. శుద్ధమైన తాగునీటి సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మూడంచెల క్లోరినేష‌న్ ప్రక్రియ‌తో నాణ్యమైన నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రిజ‌ర్వాయ‌ర్ల దగ్గర మ‌రింత క‌ట్టుదిట్టమైన భ‌ద్రత‌ చర్యలు తీసుకుంటామన్నారు. రేపే 100 మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను నియమిస్తామన్నారు. మ‌రో 200 మంది జ‌ల‌మండ‌లి సిబ్బందితో భ‌ద్రతను ప‌ర్యవేక్షిస్తామన్నారు. 600 సీసీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని దానకిషోర్‌ తెలిపారు. Updated Date - 2021-12-10T02:15:02+05:30 IST