మూడు రోజులు తేలికపాటి వర్షాలు

ABN , First Publish Date - 2021-08-20T12:24:07+05:30 IST

రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. ఉపరితల ద్రోణి జార్ఖండ్‌ నుంచి

మూడు రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌: రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. ఉపరితల ద్రోణి జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, విదర్భ మీదుగా ఉత్తర మహారాష్ట్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతున్నట్లు తెలిపారు. గురువారం కొన్నిచోట్ల భారీ వర్షాలు, పలుచోట్ల  ఓ మోస్తరు వర్షాలు కురిసినట్లు చెప్పారు.

Updated Date - 2021-08-20T12:24:07+05:30 IST