జోగయ్యకు కోర్టు ధిక్కరణ కింద సామాజిక శిక్ష విధించిన హైకోర్టు

ABN , First Publish Date - 2021-07-13T01:28:23+05:30 IST

జోగయ్యకు కోర్టు ధిక్కరణ కింద సామాజిక శిక్ష విధించిన హైకోర్టు

జోగయ్యకు కోర్టు ధిక్కరణ కింద సామాజిక శిక్ష విధించిన హైకోర్టు

హైదరాబాద్: విశ్రాంత అదనపు డీసీపీ జోగయ్యకు కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు సామాజిక శిక్ష విధించింది. ముషీరాబాద్‌లోని వృద్ధాశ్రమంలో 3 నెలల పాటు ఉచిత భోజనం అందించాలని హైకోర్టు ఆదేశించింది. శని, ఆదివారాల్లో వృద్ధులతో గంట పాటు గడపాలని జోగయ్యకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్నట్టు జోగయ్యపై అభియోగం ఉంది. కోర్టు ధిక్కరణ కింద జోగయ్యకు గతంలో సింగిల్ జడ్జి రూ.5వేల జరిమానా విధించారు. సింగిల్ జడ్జి తీర్పును ధర్మాసనం వద్ద విశ్రాంత అదనపు డీసీపీ జోగయ్య అప్పీల్ చేశారు. సమాజ సేవ చేయాలని ఆదేశిస్తూ కోర్టు ధిక్కరణ శిక్షను సీజే ధర్మాసనం కొట్టివేసింది.

Updated Date - 2021-07-13T01:28:23+05:30 IST