Hyd: పాతబస్తీ, చాంద్రాయణగుట్టలో దారి దోపిడీ దొంగల హల్‎చల్

ABN , First Publish Date - 2021-08-10T17:21:05+05:30 IST

నగరంలోని పాతబస్తీ, చాంద్రాయణగుట్ట పరిధిలో దారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బైక్ పై వెళ్తున్న వారిని ఆపి వారిపై దాడి దిగారు. షాహీనగర్ నుండి 3 వాహనాలపై

Hyd: పాతబస్తీ, చాంద్రాయణగుట్టలో దారి దోపిడీ దొంగల హల్‎చల్

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ, చాంద్రాయణగుట్ట పరిధిలో దారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బైక్ పై వెళ్తున్న వారిని ఆపి వారిపై దాడి దిగారు. షాహీనగర్ నుండి 3 వాహనాలపై రెండు బైక్‎లను వెంబడించారు. ఎర్రకుంట వద్ద వాహనాన్ని ఆపి నిందితులు దాడి చేశారు. రెండు మొబైల్ ఫోన్లు, రూ.30వేల నగదు, పల్సర్ వాహనం లాక్కుని పారిపోయారు. బాధితులు చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-08-10T17:21:05+05:30 IST