హైదరాబాద్‌లో ఇవాళ్టి నుంచి Book Fair

ABN , First Publish Date - 2021-08-12T15:17:16+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నుంచి నగరంలోని..

హైదరాబాద్‌లో ఇవాళ్టి నుంచి Book Fair

హైదరాబాద్‌ సిటీ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నుంచి నగరంలోని పంజాగుట్ట మెట్రోస్టేషన్‌ ఎక్స్‌పో గల్లేరియాలో బుక్‌ ఫెయిర్‌ (పుస్తక ప్రదర్శన) నిర్వహిస్తున్నారు. కితాబ్‌ లవర్స్‌ పేరిట ఈనెల 12 నుంచి 15 వరకు స్టేషన్‌లోని లెవల్‌-1లో బుక్‌ఫెయిర్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ‘లోడ్‌ ది బాక్స్‌’లో ఒకేసారి అన్ని రకాల పుస్తకాలకు సంబంధించిన చెల్లింపులు చేసుకునే అవకాశం కూడా ఉంది. రూ.1100 మనీసేవర్‌ బాక్స్‌లో నచ్చిన 10-13 పుస్తకాలు పొందవచ్చు.


అలాగే రూ.1650 వెల్త్‌బాక్స్‌లో 17-20 పుస్తకాలు, రూ. 2750 ట్రెజర్‌ బాక్స్‌లో 30-33 పుస్తకాలు పొందే అవకాశం ఉంది. బుక్‌ఫెయిర్‌లో మొత్తం రెండు లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, ప్రదర్శనను సందర్శించేందుకు ఎలాంటి ప్రవేశ రుసుమూ లేదని, పుస్తక ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు.

Updated Date - 2021-08-12T15:17:16+05:30 IST