18 నుంచి ‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’

ABN , First Publish Date - 2021-11-28T08:46:23+05:30 IST

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ను డిసెంబరు 18 నుంచి 27వరకు నిర్వహించనున్నట్లు మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ తెలిపారు.

18 నుంచి ‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ను డిసెంబరు 18 నుంచి 27వరకు నిర్వహించనున్నట్లు మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ తెలిపారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీనిపై శనివారం ఆయన తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. ఈ పుస్తక ప్రదర్శనకు రెండు రాష్ట్రాల నుంచి పుస్తక ప్రియులు హాజరవుతున్నందున అతిపెద్ద పుస్తక పండుగగా మారిందని ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. సమావేశంలో హై దరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌, సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ శివకుమార్‌, డాక్టర్‌ శరత్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-28T08:46:23+05:30 IST