హైదరాబాద్లో అధ్వాన్నంగా రహదారులు
ABN , First Publish Date - 2021-08-08T20:15:24+05:30 IST
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి.
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. అడుగుకోగుంటతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రహదారులు బాగా దెబ్బితిన్నాయి. నగరంలో అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై కంకరతేలి ప్రమాదకర పరిస్థితిలో రోడ్లు ఉన్నాయి. పైప్ లైన్లకోసం రోడ్లు తవ్వి.. అలాగే విడిచిపెడుతున్నారని, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. వర్షం వస్తే గుంతలు కూడా కనబడవని, పడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.