ప్రియురాలి ఇంటికి వెళ్లి హంగామా చేసిన ప్రియుడు

ABN , First Publish Date - 2021-06-21T15:57:25+05:30 IST

బాలానగర్ శోభన కాలనీలో అర్ధరాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లి శుభం (26) అనే యువకుడు హంగామా చేశాడు.

ప్రియురాలి ఇంటికి వెళ్లి హంగామా చేసిన ప్రియుడు

హైదరాబాద్: బాలానగర్ శోభన కాలనీలో అర్ధరాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లి శుభం (26) అనే యువకుడు హంగామా చేశాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో శోభన కాలనీలోని ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమెను బయటకు రమ్మన్నాడు. యువతి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. చివరికి అర్ధరాత్రి సమయంలో తాను బయటకు రానని యువతి తేల్చి చెప్పడంతో ప్రియుడు భవనం 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.


జగద్గిరిగుట్ట నెహ్రునగర్‌కు చెందిన యువకుడు శుభం మద్యం మత్తులో యువతి ఇంటికి వెళ్లి హంగామా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా యువతి కుటుంబీకులు తన కుమారుడిని కొట్టి చంపినట్లు యువకుడి తండ్రి ఆరోపిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-06-21T15:57:25+05:30 IST