న్యూఇయర్ వేడుకలను ఎంజాయ్ చేయండి...కానీ: AV ranganath
ABN , First Publish Date - 2021-12-30T19:35:11+05:30 IST
నూతన సంవత్సర వేడుకలపై ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించామని హైదరాబాద్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు.

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలపై ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించామని హైదరాబాద్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. గురువారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ న్యూ ఇయర్ వేడుకలను ఎంజాయ్ చేయండి కానీ, ఎక్కడైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే కట్టిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి డ్రైవ్ చేస్తే వారిపై కేసులు నమోదు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరుచనున్నట్లు తెలిపారు. 100 టీమ్స్‌తో ఆకస్మిక తనిఖీలు చేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పబ్‌ల వద్ద రోడ్లపై వాహనాల పార్కింగ్‌పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బేగం పేట్, పీవీ ఎక్స్ ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ మినహా అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తామని తెలిపారు. ఈ సెలెబ్రేషన్స్‌లో జీరో ఆక్సిడెంట్ ఉండాలనే దానిపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా డ్రైవర్‌ను పెట్టుకొని సేఫ్‌గా ఇంటికి వెళ్ళాలని ఏవీ రంగనాథ్ సూచించారు.