ఆ వీడియోలో వస్తున్న పుకార్లను నమ్మవద్దు..:Ravinder Reddy

ABN , First Publish Date - 2021-10-31T18:04:46+05:30 IST

హుజురాబాద్‎లో ఉప ఎన్నిక శనివారం జరిగింది. ఉప ఎన్నికలో 200వ పోలింగ్ స్టేషన్‎లో మాక్ పోలింగ్ సందర్భంగా వివి ప్యాట్ చేయలేదు. పోలింగ్‎కి ముందే దాన్ని తీసేసినట్లు రిటర్నింగ్

ఆ వీడియోలో వస్తున్న పుకార్లను నమ్మవద్దు..:Ravinder Reddy

కరీంనగర్: హుజురాబాద్‎లో ఉప ఎన్నిక శనివారం జరిగింది. ఉప ఎన్నికలో 200వ పోలింగ్ స్టేషన్‎లో మాక్ పోలింగ్ సందర్భంగా వివి ప్యాట్ చేయలేదు. పోలింగ్‎కి ముందే దాన్ని తీసేసినట్లు రిటర్నింగ్ ఎన్నికల అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. దాని స్థానంలో మరో వివి ప్యాట్‎ను అమర్చామని తెలిపారు.  వివి ప్యాట్ దాన్ని వాడలేదన్నారు. మాక్ పోలింగ్ ముందే తీసేసామని దాన్ని గోదాముకు తరలించే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసి వైరల్ చేశారని తెలిపారు. ఆ వీడియోతోనే గందరగోళం ఏర్పడింది. జమ్మికుంటలో బస్ రిపేర్ సమయంలో సిబ్బంది అక్కడే ఉన్నారని, బస్సుల్లోంచి ఎవ్వరూ దిగలేదని ,సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని రవీందర్ రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2021-10-31T18:04:46+05:30 IST