3.5 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం సీజ్‌

ABN , First Publish Date - 2021-10-28T08:04:23+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచార గడువు బుధవారంతో ముగిసింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ..

3.5 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం సీజ్‌

  • దళిత బంధుపై ఎన్నికల సంఘం స్పందన అబద్ధం..
  • స్పష్టం చేసిన ఎన్నికల అధికారులు

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచార గడువు బుధవారంతో ముగిసింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి బుధవారం సాయత్రం వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ. 3.50 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటించారు. దళిత బంధు పథకాన్ని నిలిపివేయడంపై సమాచార హక్కు చట్టం పరిధిలో దాఖలైన దరఖాస్తుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చినట్టుగా ప్రచారంలో ఉన్న లేఖ నకిలీదని స్పష్టం చేశారు. 


డబ్బు అందలేదంటూ రాస్తారోకో

హుజూరాబాద్‌ రూరల్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓ పార్టీ నాయకులు ఓటుకు రూ.6 వేలు పంచుతున్నట్లు ప్రచారం జరగగా.. తమకు ఆ నగదు ఇవ్వలేదంటూ హుజూరాబాద్‌ మండలంలోని రంగాపూర్‌, రాంపూర్‌ గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్‌-జమ్మికుంట ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి రాస్తారోకో చేశారు. తమకు కూడా రూ.6 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు వచ్చి వారితో మాట్లాడి పంపించారు.

Updated Date - 2021-10-28T08:04:23+05:30 IST