హుజూరాబాద్‌ అభ్యర్థి ఎంపికపై రెండుగా చీలిన కాంగ్రెస్‌ పార్టీ

ABN , First Publish Date - 2021-09-03T22:21:01+05:30 IST

హుజూరాబాద్‌ అభ్యర్థి ఎంపికపై రెండుగా చీలిన కాంగ్రెస్‌ పార్టీ

హుజూరాబాద్‌ అభ్యర్థి ఎంపికపై రెండుగా చీలిన  కాంగ్రెస్‌ పార్టీ

హైదరాబాద్: హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌లో సెగ తగిలింది. కొండా సురేఖ అభ్యర్థిత్వంపై పార్టీ రెండుగా చీలింది. 2023 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్థానికులకే హుజూరాబాద్ టికెట్ ఇవ్వాలని సీనియర్లు డిమాండ్ చేశారు. సీనియర్ల అభ్యంతరాలతో అభ్యర్థి ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. హుజూరాబాద్‌లో పోటీకోసం ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. పార్టీ నిర్ణయానికి స్పందన కరువైంది. దరఖాస్తు చేసేందుకు కొండా సురేఖ నిరాసక్తత చూపారు. పార్టీ కోరితేనే పోటీచేయాలనే యోచనలో కొండా సురేఖ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 10న భట్టి విక్రమార్క, రాజనర్సింహ కమిటీ సభ్యులు నివేదిక ఇవ్వనున్నారు. 

Updated Date - 2021-09-03T22:21:01+05:30 IST