మరో ఐదుగురు సబ్‌ రిజిస్ట్రార్లపై వేటు

ABN , First Publish Date - 2021-11-21T08:12:41+05:30 IST

రాష్ట్రంలో అవినీతి సబ్‌ రిజిస్ట్రార్ల సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వరంగల్‌ జిల్లాలో నలుగురు సబ్‌ రిజిస్ట్రార్లను సస్పెండ్‌ చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు.. తాజా గా నల్లగొండ జిల్లాలో మరో ఐదుగురిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. నల్లగొండ జాయింట్‌-1

మరో ఐదుగురు సబ్‌ రిజిస్ట్రార్లపై వేటు

9కి చేరిన సస్పెన్షన్లు.. మరో నలుగురికి నోటీసులు


హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అవినీతి సబ్‌ రిజిస్ట్రార్ల సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వరంగల్‌ జిల్లాలో నలుగురు సబ్‌ రిజిస్ట్రార్లను సస్పెండ్‌ చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు.. తాజా గా నల్లగొండ జిల్లాలో మరో ఐదుగురిపై  సస్పెన్షన్‌ వేటు వేశారు. నల్లగొండ జాయింట్‌-1 సబ్‌ రిజిస్ట్రార్‌ ముభా షరీఫ్‌, దేవరకొండ ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకట్‌రెడ్డి, పలుచోట్ల ఇన్‌చార్జి ఎస్‌ఆర్‌లుగా పని చేసిన గోపి, వెంకటేశ్వర్లు, నగేశ్‌లను సస్పెండ్‌ చేస్తూ స్టాంపులు, రిజిస్ట్రేష న్ల శాఖ డీఐజీ సుభాషిణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరికొందరిపై విచారణ కొనసాగుతున్నట్లు, వీరికి ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేసినట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వీరే కాకుండా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.  మొత్తంగా ఇప్పటివరకు సస్పెన్షన్‌ వేటు ప డిన సబ్‌ రిజిస్ట్రార్ల సంఖ్య తొమ్మిదికి చేరింది. అయితే ఖమ్మం, నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో పలువురు సబ్‌ రిజిస్ట్రార్లపై అత్యధిక ఫి ర్యాదులు వస్తున్నా.. వారిపై చర్యలు తీసుకోవడంలేదనే అరోపణలు వస్తున్నాయి. సబ్‌ రిజిస్ట్రార్ల అవినీతిపై ‘ఆంధ్రజ్యోతి’ లో ఈ నెల 17న సబ్‌ రిజిస్ట్రార్ల బరితెగింపు’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనంపై రాష్ట్ర వ్యా ప్తంగా చర్చ జరగడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఆ శా ఖ ఉన్నతాధికారులు ఏరివేత మొదలుపెట్టారు. 

Updated Date - 2021-11-21T08:12:41+05:30 IST