దళిత కుటుంబాలను బహిష్కరిస్తే.. మీరేం చేస్తున్నారు?

ABN , First Publish Date - 2021-02-05T07:59:13+05:30 IST

130 దళిత కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేసిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మా్‌సపూర్‌లో దళిత కుటుంబాలకు...

దళిత కుటుంబాలను బహిష్కరిస్తే.. మీరేం చేస్తున్నారు?

  • సిరిసిల్ల ఎస్పీపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం.. నోటీసులు జారీ
  • ‘ఆంధ్రజ్యోతి’ కథనం సుమోటోగా స్వీకరణ.. కేసు నమోదు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): 130 దళిత కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేసిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మా్‌సపూర్‌లో దళిత కుటుంబాలకు ఎవరూ సహకరించద్దని కుల సంఘాల పెద్దలు నిర్ణయం తీసుకుంటే.. మీరేం చేస్తున్నారని సిరిసిల్ల ఎస్పీని ప్రశ్నించింది. బాధిత కుటుంబాలు స్థానిక డీఎస్పీ, సీఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడింది. ‘‘130 దళిత కుటుంబాల సామాజిక  బహిష్కరణ’’ శీర్షికన ఈనెల 1న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాన్ని సుమోటోగా తీసుకున్న హెచ్‌ఆర్సీ.. గురువారం కేసు నమోదు చేసింది. ఘటనపై ఈ నెల 24లోగా తమకు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కాగా, తమను కులం పేరుతో దూషించారంటూ 15 మందిపై దళితులు ఫిర్యాదు చేయగా, దీన్ని మనసులో పెట్టుకొని పలు కుల సంఘాల పెద్దలు గ్రామంలోని 130 దళిత కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేసిన విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. 


Updated Date - 2021-02-05T07:59:13+05:30 IST