దుబ్బాకలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించాం: హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-12-25T20:54:38+05:30 IST

దుబ్బాకలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

దుబ్బాకలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించాం: హరీష్‌రావు

సిద్దిపేట: దుబ్బాకలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి కల అని చెప్పారు. దుబ్బాక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వైద్యరంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని తెలిపారు. 18 ఏళ్లు పైబడినవారందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌పై అనుమానం, అపోహలు పెట్టుకోవద్దన్నారు. ఒమైక్రాన్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హరీష్‌రావు సూచించారు.

Updated Date - 2021-12-25T20:54:38+05:30 IST