వక్ఫ్ బోర్డు ఆస్తులపై సీబీసీఐడీ విచారణ కరెక్టే: హోంమంత్రి

ABN , First Publish Date - 2021-10-08T00:53:22+05:30 IST

వక్ఫ్ బోర్డు ఆస్తులపై సీబీసీఐడీ విచారణ చేపట్టాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హోం శాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ హర్షం వ్యక్తం చేశారు.

వక్ఫ్ బోర్డు ఆస్తులపై సీబీసీఐడీ విచారణ కరెక్టే: హోంమంత్రి

హైదరాబాద్: వక్ఫ్ బోర్డు ఆస్తులపై సీబీసీఐడీ విచారణ చేపట్టాలన్న ముఖ్యమంత్రి  నిర్ణయం పట్ల హోం శాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ హర్షం వ్యక్తం చేశారు. వక్ఫ్ మరియు  దేవాదాయ ఆస్తులను రక్షించడం పట్ల ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారని హోం మంత్రి అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా తమ చిత్తశుద్ధిని తెలియజేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరగనున్న భూముల సర్వే ద్వారా పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయ పడ్డారు. 


తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటుకు ముందు వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలు జరిగాయనే ఆరోపణలున్నాయని అన్నారు. ఇందులో ప్రస్తుత ప్రభుత్వ ప్రమేయం లేదని ఆయన అన్నారు. హోం మంత్రి మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తులపై సిబిసిఐడి విచారణకు ఆదేశించడం ద్వారా కేసిఆర్ సరికొత్త రికార్డు సృష్టించారని అన్నారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-10-08T00:53:22+05:30 IST