హోం ఐసొలేషన్‌ కిట్ల పంపిణీ

ABN , First Publish Date - 2021-12-26T09:11:38+05:30 IST

ఒమైక్రాన్‌ శరవేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.

హోం ఐసొలేషన్‌ కిట్ల పంపిణీ

జిల్లాలకు తొలి విడతగా 3 లక్షల కిట్లు 

హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఒమైక్రాన్‌ శరవేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఒకవైపు వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేస్తూనే, మరోవైపు కొవిడ్‌ సోకితే ఇళ్ల వద్దనే చికిత్స అందించేందుకు హోం ఐసోలేషన్‌ కిట్లను ఇవ్వబోతోంది. మున్ముందు కేసులు పెరుగుతాయన్న అంచనాలతో వీటిని ఇప్పటికే సిద్ధం చేసింది. ఒమైక్రాన్‌ వేరియంట్‌ సోకినా చికిత్సా విధానంలో పెద్దగా మార్పులేమీ ఉండటం లేదు. గతంలో కొవిడ్‌కు ఏ తరహా చికిత్స అందించా రో ఇప్పుడు దీనికీ అదే ట్రీట్‌మెంట్‌ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి, రెండో వేవ్‌ల లో హోం ఐసోలేషన్‌ కిట్లను వైద్యశాఖ భారీ సంఖ్య లో పంపిణీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ) వద్ద 8.71 లక్షల హోం ఐసోలేషన్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయి. 


శనివారం వాటిని జిల్లాలకు పంపారు. తొలి విడతగా ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో జిల్లాకు 30 వేల కిట్లు అంటే తొలి దశలో మొత్తం మూడు లక్షల కిట్లను జిల్లాలకు పంపారు. కేసుల సంఖ్య పెరిగే కొద్ది హోం ఐసోలేషన్‌ కిట్ల సంఖ్యను పెంచనున్నారు. రాష్ట్రంలో తొలిడోసు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ 99 శాతానికి చేరుకుంది.  డిసెంబరు చివరి నాటికి తొలి డోసు పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్న సర్కారు ఆ దిశగా చేసిన ప్రయత్నాల్లో కొంతమేర సఫలమైంది. రాష్ట్రంలో టీకా అర్హులు 2.77 కోట్ల మంది ఉండగా, ఇప్పటి వరకు తొలిడోసు 2.75 కోట్ల మందికి ఇచ్చారు. మరో రెండు లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇస్తే తొలిడోసు పం పిణీ వందశాతం పూర్తవుతుంది. ఇక రెండో డోసు 1.76 కోట్ల మందికే ఇచ్చారు.  వందశాతం కావాలంటే 2 నెలలు పడుతుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2021-12-26T09:11:38+05:30 IST