18 ఏళ్లు నిండినవారు వ్యాక్సిన్ వేసుకోవాలి
ABN , First Publish Date - 2021-11-21T05:35:01+05:30 IST
18 ఏళ్లు నిండినవారు వ్యాక్సిన్ వేసుకోవాలి

హనుమకొండ అర్బన్, నవంబరు 20: 18 యేళ్లు నిండిన ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ కె.లలితాదేవి సూచించారు. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా శనివారం ఐనవోలు పీహెచ్‌సీ పరిధిలోని జరుగుతున్న వ్యాక్సినేషన్ టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. నూటికి నూరుశాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.