ఈ ఏడాది నిప్పులు కక్కనున్న వేసవి కాలం..

ABN , First Publish Date - 2021-02-26T16:43:39+05:30 IST

ఈ ఏడాది వేసవి అదరగొట్టనుంది. నిప్పులు కక్కనుంది. అంతేకాదు ముందుగానే ..

ఈ ఏడాది నిప్పులు కక్కనున్న వేసవి కాలం..

హైదరాబాద్: ఈ ఏడాది వేసవి అదరగొట్టనుంది. నిప్పులు కక్కనుంది. అంతేకాదు ముందుగానే ఎండలు ప్రతాపం చూపిస్తున్నాయి. సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. స్వయంగా వాతావరణ శాఖ చెబుతున్న అంచనాలివి. ఈ ఏడాది హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా ఎక్కువగా నమోదవుతాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. అంటే రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయిని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లోంచి బయటకు వెళితే వేసవి కాలాన్ని తలపిస్తోంది. అసలు శీతాకాలం పూర్తిగా గడవకముందే ఇంతగా ఎండల్ని ఎదుర్కోవాల్సి రావడంపై ఆందోళన నెలకొంది.

Updated Date - 2021-02-26T16:43:39+05:30 IST