మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే

ABN , First Publish Date - 2021-12-16T00:26:53+05:30 IST

మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు

మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌: మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే విధించింది. ఐటీఐ తరలించకుండా చూడాలని సీజే జస్టిస్ సతీష్‌చంద్రశర్మకు విద్యార్థులు లేఖ రాశారు. ఐటీఐ భూమిని కంపెనీలకు కేటాయించే ప్రయత్నం జరుగుతోందని విద్యార్థులు ఆ లేఖలో పేర్కొన్నారు. విద్యార్థుల లేఖను సుమోటోగా హైకోర్టు సీజే ధర్మాసనం స్వీకరించింది. ఐటీఐ తరలిస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బంది పడతారని హైకోర్టు పేర్కొంది. 8 వారాల్లో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 


Updated Date - 2021-12-16T00:26:53+05:30 IST