‘ఫీజుల’పై ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు

ABN , First Publish Date - 2021-10-20T08:09:48+05:30 IST

‘ఫీజుల’పై ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు

‘ఫీజుల’పై ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు

హైదరాబాద్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ పాఠశాలల్లో ఇప్పటికీ ఫీజుల రెగ్యులేటరీ వ్యవస్థ లేదని, రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలివ్వాలని కోరుతూ హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ హైకోర్టులో పిల్‌ వేసింది. ఫీజుల నియంత్రణపై ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ సిఫారసులను అమలు చేయాలని పిటిషనర్‌ విజ్ఞప్తి చేశారు. దీనిపై సీజే సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఏ రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌, సీబీఎ్‌సఈ చైర్‌పర్సన్‌, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్యాల అసోసియేషన్‌, కేంద్ర పాఠశాల విద్యాశాఖకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.

Updated Date - 2021-10-20T08:09:48+05:30 IST