అత్యాచారంతో బాలిక దాల్చిన గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతి

ABN , First Publish Date - 2021-10-08T02:41:19+05:30 IST

అత్యాచారంతో బాలిక దాల్చిన గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతి

అత్యాచారంతో బాలిక దాల్చిన గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్: అత్యాచారంతో బాలిక దాల్చిన గర్భాన్ని తొలగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. 16 ఏళ్ల బాలిక గర్భంలోని 26 వారాల పిండాన్ని తొలగించాలని కోఠి ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. నిపుణులతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అబార్షన్‌కు ఆస్పత్రి నిరాకరించడంతో బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించింది. పిండం, హక్కుల కన్నా అత్యాచార బాధితురాలి హక్కులే ముఖ్యమని హైకోర్టు తెలిపింది. చట్ట పరిమితులకు లోబడి అవాంఛనీయ గర్భం వద్దనుకునే హక్కు ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి తీర్పు వెల్లడించారు. 

Updated Date - 2021-10-08T02:41:19+05:30 IST