జీవో 111, కోకాపేట్ భూముల వేలంపై హైకోర్టు విచారణ

ABN , First Publish Date - 2021-08-26T00:15:38+05:30 IST

జీవో 111, కోకాపేట్ భూముల వేలంపై హైకోర్టులో

జీవో 111, కోకాపేట్ భూముల వేలంపై హైకోర్టు విచారణ

హైదరాబాద్: జీవో 111, కోకాపేట్ భూముల వేలంపై హైకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది.  కోకాపేట్ లేక్ నుంచి 3.5కి.మీ.దూరంలో బఫర్ జోన్ ఉందని పిటిషనర్ తెలిపారు. కోకాపేట్‌కు 700 మీటర్ల దూరంలో ఉన్న భూములను ప్రభుత్వం ఏ విధంగా ఆక్షన్ చేసిందని పిటిషనర్ ప్రశ్నించారు. వట్టి నాగులపల్లిలో 111 జీవో ప్రకారం పిటిషనర్ భూములు ఎఫ్‌టీఎల్‌ జోన్‌లో ఉన్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. హైపవర్ కమిటీ రీఫరెన్స్లని ఎందుకు ఇప్పటి వరకు అమలు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం నియమించిన ఈపీటీఆర్ఐ రీఫరెన్స్‌ని ఎందుకు హై పవర్ కమిటీ‌కి పంపలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.


ప్రభుత్వం వేలం వేసిన భూములలో వచ్చినటువంటి సొమ్మును ESCROW ఖాతాలో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. వేలం వేసిన భూముల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా సమకూర్చిన తర్వాతనే ఖాతా నుంచి ఆ డబ్బులను ప్రభుత్వం తీసుకోవాలని హైకోర్టు  సూచించింది. అప్పటి వరకు ఆ డబ్బులన్నీ ESCROW అకౌంట్ లోనే ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం కోరిన ఈపీటీ ఆర్‌ఐ రిపోర్ట్‌లోని రిఫరెన్స్‌ని హైపవర్ కమిటీ ఎందుకు ఇవ్వలేదని  హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం భూమి 948 ఎకరాలు 377 పార్ట్స్‌లో ఉందని హైకోర్టుకు  ప్రభుత్వం తెలిపింది. జీవో 111 ను ఎత్తి వేస్తున్నారన్న ముఖ్యమంత్రే స్వయంగా విలేఖర్ల ముందు చెప్పినటువంటి విషయము అవాస్తవమని కోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. 


ఇప్పటికి సుమారు నాలుగు సంవత్సరాలు దాటిపోయినా హైపవర్ కమిటీ ఇప్పటివరకు ఎందుకు సమావేశం కాలేదని హైకోర్టు అడిగింది. హైపవర్ కమిటీ రిఫరెన్సు‌ని ఎందుకు మీరు అమలు చేయలేదని హైకోర్ట్ ప్రశ్నించింది. హెచ్ఎండీఎ, ఏపీటీఆర్ఐని నివేదికను కోరిన ప్రభుత్వం ఎందుకు దాన్ని అమలు చేయటం లేదని హైకోర్టు ప్రశ్నించింది. రేపు పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు అదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.  


Updated Date - 2021-08-26T00:15:38+05:30 IST