కరోనా, ఓమిక్రాన్ కేసులపై నేడు హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-12-30T16:04:18+05:30 IST

కరోనా, ఓమిక్రాన్ కేసులపై నేడు హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. హైకోర్ట్ ఉత్తర్వులను పట్టించుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు.

కరోనా, ఓమిక్రాన్ కేసులపై నేడు హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : కరోనా, ఓమిక్రాన్ కేసులపై నేడు హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. హైకోర్ట్ ఉత్తర్వులను పట్టించుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకలకు ఇతర రాష్ట్రల మాదిరి ఆంక్షలు పెట్టాలని పిటిషనర్ పేర్కొన్నారు. ప్యాండమిక్, ఎపిడెమిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. ఇష్టానుసారంగా ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలకు అనుమతిచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 62 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాలని పిటిషనర్ కోరారు. 

Updated Date - 2021-12-30T16:04:18+05:30 IST