రామప్ప అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి:హైకోర్టు

ABN , First Publish Date - 2021-08-27T10:21:46+05:30 IST

ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన రామప్ప గుడి అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. రామప్ప గుడికి ప్రపంచ

రామప్ప  అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి:హైకోర్టు

హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన రామప్ప గుడి అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ  చేపట్టింది. రామప్ప గుడి ప్రాంతంలో పర్యావరణపరంగా నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.ఎన్ని కిలోమీటర్ల వరకు రక్షిత ప్రాంతంగా గుర్తించాలి? అన్న అంశంపై మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ సిఫారసుల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని భారత పురాతత్వ శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. 

Updated Date - 2021-08-27T10:21:46+05:30 IST